1 మొదటి (నిబంధనకైతే) సేవానియమములును ఈ లోకసంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను.
2 ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, (దానిమీద) ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.
3 రెండవ తెరకావల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.
4 అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలును ఉండెను.
5 దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్పవల్లపడదు.
6 ఇవి ఈలాగు ఏర్పచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోకి వెళ్లుదురు గాని
7 సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధానయాజకుడొక్కడే రక్తము చేత పట్టుకొనుచు రెండవ గుడారములోకి ప్రవేశించును ఆ రక్తము తనకొరకును ప్రజల ఆజ్ఞానకృతములకొరకును అతడర్పించును.
8 దీనినిబట్టి ఆ మొదటి గుడారమింక నిలుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు.
9 ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.
10 ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోనుసంబంధించిన శరీరాచారములు మాత్రమై యున్నవి.
11 అయితే క్రీస్తు రాబోవుచున్నమేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా,
12 మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
13 ఏలయనగా మేకలయొక్కయు ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడినవారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల,
14 నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీమనస్సాక్షిని ఎంతో యెక్కవగా శుద్ధిచేయును.
15 ఈ హేతువుచేత మొదటి నిబంధనకాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము రుజువుపరచుట అవశ్యము.
17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైన చెల్లునా?
18 ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు.
19-20. ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతియాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొర్రెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని - దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరిమీదను ప్రోక్షించెను. 2
21 అదేవిధముగా గుడారము మీదను సేవపాత్రలన్నిటిమీదను ఆ రక్తమును ప్రోక్షించెను.
22 మరియు ధర్మశాస్త్రప్రకారము సమస్తవస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తముచిందిపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
23 పరలోకమందున్నవాటిని పోలిన వస్తువులు ఇట్టిబలులవలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోకసంబంధమైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడవలసియుండెను.
24 అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.
25 అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతిసంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోకి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు.
26 అట్లయినయెడల జగత్తు పునాదివేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణచేయుటకై యొక్కసారే ప్రత్యక్షపరచబడెను.
27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
28 ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాప (సంభంధ)ములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును.
Download Audio File

No comments:
Post a Comment