1 ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన పరశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనినదానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.
2 దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించినవానికి నమ్మకముగా ఉండెను.
3 ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును;సమస్తమును కట్టినవాడుదేవుడే.
4 ఇంటికంటె దాని కట్టినవాడెక్కువ ఘనతపొందినట్లు, ఈయన మోషే కంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.
5 ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.
6 అయితే క్రీస్తు, కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
7 మరియు పరశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు
8 - నేడు మీరాయన శబ్దమును వినినయెడల అరణ్యములో శోధన పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
9 నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
10 కావున నేను ఆ తరమువారిమీద కోపగించి - వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నామార్గములను తెలిసికొనలేదు
11 గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలోప్రవేశింపరని చెప్పితిని
12 సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.
13-15. నేడు మీరాయన శబ్దమును వినినయెడల కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు - నేడు అని చెప్పబడిన సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి. ఏలయనగా మొదటినుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడల క్రీస్తులో పాలివారమై యుందుము.
16 విని కోపము పుట్టించినవారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా?
17 ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారిమీదనే గదా? వారి శవములుఅరణ్యములో రాలిపోయెను.
18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరినిగూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా?
19 కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము.
Download Audio File

No comments:
Post a Comment