1 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేషజాగ్రత్త కలిగియుండవలెను.
2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా
3-4. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను మహత్కార్యములచేతను నానావిధములైన అద్భుతములచేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను.
5 మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు.
6 అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడునీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవునరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
7 నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివిమహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివినీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి
8 వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని
9 దేవుని కృపవలన ఆయన ప్రతిమననుష్యునికొరకు మరణము అనుభవించునట్లు, 1దూతల కంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించినవానిగా ఆయనను చూచుచున్నాము.
10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.
11-12. పరిశుద్ధపరచువానికిని పరశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కడేమూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక - నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజమధ్యనీ కీర్తిని గానము చేతునుఅనెను.
13 మరియు - నే నాయను నమ్ముకొనియుందును అనియు - ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. 5
14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదినిమరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
16 ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రహాముసంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.
17 కావున ప్రజల పాపములకు నివృత్తి కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులవంటివాడు కావలసివచ్చెను.
18 తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడైయున్నాడు.

No comments:
Post a Comment