1 కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములనుగూర్చిన బోధయు,
2 హస్తనిక్షేపణమును మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము.
3 దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము.
4 ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రూచిచూచి, పరశుద్ధాత్మలో పాలివారై
5 దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల (ప్రభావమును) అనుభవించినతరువాత
6 తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
7 ఎట్లనగా, భూమి తనమీద తరచుగా కురియు వర్షమును త్రాగి యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.
8 అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకు కాల్చివేయబడును.
9 అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము.
10 మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు.
11-12. మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనువారిని పోలినడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.
13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక
14 తనతోడు అని ప్రమాణముచేసి - నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునునిశ్చయముగా నిన్ను అభివృద్ధి పొందింతునుఅని4 చెప్పెను.
15 (ఆ మాట నమ్మి) అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.
16 మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములలో వివాదాంశమును పరష్కారము చేయునది ప్రమాణమే.
17-18. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్టలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణముచేసి వాగ్దానమును దృఢపరచెను.
19 ఈ నిరీక్షణ మన ఆత్మకు నిశ్చలమును, స్థిరమును, తెరలోపల వ్రవేశించునదియునైయున్న లంగరువలె ఉన్నది.
20 నిరంతరము మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధానయాజకుడై యేసు మనకంటె ముందుగా మన పక్షము ఆ తెరలో ప్రవేశించెను.
Download Audio File

No comments:
Post a Comment