1 పూర్వకాలమందు నానాసమయములలోనునానావిధములుగాను ప్రవక్తలద్వారా మనపితరులతో మాటలాడిన దేవుడు 2 ఈ దినముల అంతమందు కుమారునిద్వారా మనతో మాటలాడెను. ఆయన (ఆ కుమారుని) సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయనద్వారా ప్రపంచములనునిర్మించెను. 3-4. ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, 3ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి, తన మహత్తుగలమాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు (దేవుని) కుడిపార్శ్వమున కూర్చుండెను. 5 ఏలయనగా-నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కంటిని అనియు; ఇదియుగాక-నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడుఅనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా? 6 మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెననిచెప్పుచున్నాడు. 7-8. -తన దూతలను వాయువులుగానుతన సేవకులనుఅగ్నిజ్వాలలుగాను చేసికొనువాడుఅని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే-దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజ్యదండమున్యాయార్థమై యున్నది 9 నీవు నీతిని ప్రేమించితివిదుర్ణీతిని ద్వేషించితివిఅందుచేత దేవుడు నీ దేవుడు నీతోటివారికంటెనిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించెను. 8 10 మరియు-ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదివేసితివిఆకాశమండలము నీ చేతిపనియైనది 11 అవి నశించును గాని నీవు శాశ్వతముగా ఉందువుఅవన్నియువస్త్రమువలె పాతగిలిపోవును 12 ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువుఅవి వస్త్రమువలె మార్చబడును గానినీవు ఏకరీతిగానే యున్నావునీ సంవత్సరములు తరుగవుఅని చెప్పుచున్నాడు. 13 అయితే-నేను నీ శత్రువులను నీ పాదములకుపాదపీఠముగా చేయు పర్యంతమునా కుడిపార్శ్వమున కూర్చుండుము10అని దూతలలో ఎవనిగూర్చియైన యెప్పుడైన చెప్పెనా? 14 వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరచారముచేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? Download Audio File
1 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేషజాగ్రత్త కలిగియుండవలెను. 2 ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా 3-4. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను మహత్కార్యములచేతను నానావిధములైన అద్భుతములచేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను. 5 మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. 6 అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడునీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవునరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? 7 నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివిమహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివినీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి 8 వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని 9 దేవుని కృపవలన ఆయన ప్రతిమననుష్యునికొరకు మరణము అనుభవించునట్లు, 1దూతల కంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించినవానిగా ఆయనను చూచుచున్నాము. 10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. 11-12. పరిశుద్ధపరచువానికిని పరశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కడేమూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక - నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజమధ్యనీ కీర్తిని గానము చేతునుఅనెను. 13 మరియు - నే నాయను నమ్ముకొనియుందును అనియు - ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. 5 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదినిమరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. 16 ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రహాముసంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు. 17 కావున ప్రజల పాపములకు నివృత్తి కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులవంటివాడు కావలసివచ్చెను. 18 తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడైయున్నాడు.
1 ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన పరశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనినదానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి. 2 దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించినవానికి నమ్మకముగా ఉండెను. 3 ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును;సమస్తమును కట్టినవాడుదేవుడే. 4 ఇంటికంటె దాని కట్టినవాడెక్కువ ఘనతపొందినట్లు, ఈయన మోషే కంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. 5 ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను. 6 అయితే క్రీస్తు, కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు. 7 మరియు పరశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు 8 - నేడు మీరాయన శబ్దమును వినినయెడల అరణ్యములో శోధన పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 9 నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 10 కావున నేను ఆ తరమువారిమీద కోపగించి - వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నామార్గములను తెలిసికొనలేదు 11 గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలోప్రవేశింపరని చెప్పితిని 12 సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. 13-15. నేడు మీరాయన శబ్దమును వినినయెడల కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు - నేడు అని చెప్పబడిన సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి. ఏలయనగా మొదటినుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడల క్రీస్తులో పాలివారమై యుందుము. 16 విని కోపము పుట్టించినవారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా? 17 ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారిమీదనే గదా? వారి శవములుఅరణ్యములో రాలిపోయెను. 18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరినిగూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా? 19 కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. Download Audio File
1 ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైన ఒక వేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందుము. 2 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినినవారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక వినబడిన వాక్యము వారికి నిష్ ప్రయోజనమైనదాయెను. 3 కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చి-నేను కోపముతో ప్రమాణముచేసినట్టువారు నా విశ్రాంతిలో ప్రవేశింపరుఅని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. 4 మరియు-దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినిముగించి విశ్రమించెనుఅని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పియున్నాడు. 5 ఇదియుగాక ఈ చోటుననే - వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు. 6-7. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో- నేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు. 8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియెక దినమునుగూర్చి ఆయన చెప్పక పోవును. 9 కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. 10 ఎదుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును. 11 కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తపడుదుము. 12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. 13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. 14 ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు కలిగియున్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిన గట్టిగా చేపట్టుదము. 15 మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృపపొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Download Audio File
1 ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును. 2 తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమి తెలియనివారియెడలను త్రోవ తప్పినవారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. 3 ఆ హేతువుచేత ప్రజలకొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు. 4 మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనత పొందును. 5 అటువలె క్రీస్తుకూడ ప్రధానయాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని-నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటినిఅని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను. 6 ఆ ప్రకారమే-నీవు నిరంతరము మెల్కీసెదెకుయొక్క క్రమములో చేరిన యాజకుడవై యున్నావుఅని మరియొకచోట చెప్పుచున్నాడు. 7 శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీరకరింపబడెను. 8 ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. 9-10. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసెదెకుయొక్క క్రమములో చేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారకుడైయెను. 11 ఇందునుగూర్చిమేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట దుష్కరము. 12 కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు. 13 మరియు పాలుత్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. 14 వయస్సువచ్చినవారుఅభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. Download Audio File
1 కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములనుగూర్చిన బోధయు, 2 హస్తనిక్షేపణమును మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము. 3 దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము. 4 ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రూచిచూచి, పరశుద్ధాత్మలో పాలివారై 5 దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల (ప్రభావమును) అనుభవించినతరువాత 6 తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము. 7 ఎట్లనగా, భూమి తనమీద తరచుగా కురియు వర్షమును త్రాగి యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. 8 అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకు కాల్చివేయబడును. 9 అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము. 10 మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. 11-12. మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనువారిని పోలినడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. 13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక 14 తనతోడు అని ప్రమాణముచేసి - నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునునిశ్చయముగా నిన్ను అభివృద్ధి పొందింతునుఅని4 చెప్పెను. 15 (ఆ మాట నమ్మి) అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను. 16 మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములలో వివాదాంశమును పరష్కారము చేయునది ప్రమాణమే. 17-18. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్టలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణముచేసి వాగ్దానమును దృఢపరచెను. 19 ఈ నిరీక్షణ మన ఆత్మకు నిశ్చలమును, స్థిరమును, తెరలోపల వ్రవేశించునదియునైయున్న లంగరువలె ఉన్నది. 20 నిరంతరము మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధానయాజకుడై యేసు మనకంటె ముందుగా మన పక్షము ఆ తెరలో ప్రవేశించెను. Download Audio File
1-3. రాజులను సంహారముచేసితిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో దశమాంశము ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేమురాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళిలేనివాడును, జీవితకాలమునకుఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. 4 ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో దశమాంశము ఇచ్చెను. 5 మరియు లేవి కుమాళ్లలోనుండి యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రముచొప్పున వారియొద్ద, అనగా ప్రజలయొద్ద దశమాంశమును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని 6 వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద దశమాంశమును పుచ్చుకొని వాగ్దానమును పొందినవానిని ఆశర్వదించెను. 7 తక్కువవాడు ఎక్కువవానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమైయున్నది. 8 మరియు (లేవి క్రమము చూడగా ) చావుకు లోనైనవారు దశమాంశములను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. 9 అంతేకాక ఒక విధమున చెప్పినయెడల దశమాంశములను పుచ్చుకొను లేవియు అబ్రాహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. 10 ఏలాగనగా మెల్కీసెదెకు అతని (పితరుని) కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. 11 ఆ లేవీయులు యాజకులైయుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణసిద్ధి కలిగినపక్షమందు అహరోను క్రమములో చేరినవాడవని చెప్పబడక మెల్కీసెదెకు క్రమములోచేరి వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? 12 ఇదియుగాక యాజకులు మార్చబడిన పక్షమున అవశ్యముగా (యాజక) ధర్మము సహా మార్చబడును. 13 ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను; ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయలేదు. 14 మన ప్రభువు గోత్రవిషయములో యాజకులనుగూర్చి మోషే యేమియు చెప్పలేదు. 15-16. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. 17 ఏలయనగా - నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమములో చేరిన యాజకుడవై యున్నావు. అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను. 2 18-19. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ ప్రయోజనమైనందునను అది నివారణచేయబడి యున్నది; అంతకంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా దేవునియొద్దకు మనము చేరుచున్నాము. 20-22. మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపయెను. వారైతే ప్రమాణము లేకుండ యాజకులవుదురు గాని యీయన - నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చాత్తాపపడడు అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. 23 మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడు ఉండ సాధ్యముకానందున అనేకులైరి గాని 24 ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను. 25 ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారిపక్షము విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. 26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నావాడును, ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. 3 27-28. ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణసిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తనస్వంత పాపములకొరకును తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరముగలవాడు కాడు; తన్నుతాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను. Download Audio File
1 మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, 2 అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైయుండి, పరలోకమందు మహామహునిసింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. 3 ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము. 4 ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్న పక్షమున యాజకుడైయండడు. 5 మోషే గుడారము అమర్చబోయినప్పుడు-కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పునసమస్తమును చేయుటకు జాగ్రత్తపడుముఅని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు సేవచేయుదురు. 6 ఈయనయైతే ఇప్పుడు మరి యెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు. 7 ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపములేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు. 8 అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడుప్రభువు ఇట్లనెను -ఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోనుయూదా ఇంటివారితోనునేను క్రొత్తనింబంధన చేయుదును. 9 అది నేను ఐగుప్తుదేశములోనుండివీరి పితరులను వెలపలికి తీసికొని వచ్చుటకువారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదుగనుక నేను వారిని అలక్ష్యము చేసితిననిప్రభువు చెప్పుచున్నాడు. 10 ఆ దినములైన తరువాతఇశ్రాయేలు ఇంటివారితోనేను చేయబోవు నిబంధన యేదనగానా ధర్మవిధులను వారి మనస్సులో ఉంచివారి హృదయములమీద వాటిని వ్రాయుదునునేను వారికి దేవుడనై యుందునువారు నాకు ప్రజలై యుందురు. 11 వారిలో ఎవడును-ప్రభువును తెలిసికొనుడనితన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను బోధింపడువారిలో చిన్నలు మొదలుకొని పెద్దల పర్యంతముఅందరును నన్ను తెలిసికొందురు. 12 నేను వారి అక్రమముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకముచేసికొనననిప్రభువు సెలవిచ్చుచున్నాడు. 13 ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది నివర్తనమగుటకుసిద్ధముగా ఉన్నది. Download Audio File
1 మొదటి (నిబంధనకైతే) సేవానియమములును ఈ లోకసంబంధమైన పరిశుద్ధస్థలమును ఉండెను. 2 ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, (దానిమీద) ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు. 3 రెండవ తెరకావల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను. 4 అందులో సువర్ణధూపార్తియు, అంతటను బంగారురేకులతో తాపబడిన నిబంధనమందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలును ఉండెను. 5 దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటినిగూర్చి యిప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. 6 ఇవి ఈలాగు ఏర్పచబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోకి వెళ్లుదురు గాని 7 సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధానయాజకుడొక్కడే రక్తము చేత పట్టుకొనుచు రెండవ గుడారములోకి ప్రవేశించును ఆ రక్తము తనకొరకును ప్రజల ఆజ్ఞానకృతములకొరకును అతడర్పించును. 8 దీనినిబట్టి ఆ మొదటి గుడారమింక నిలుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. 9 ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి. 10 ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోనుసంబంధించిన శరీరాచారములు మాత్రమై యున్నవి. 11 అయితే క్రీస్తు రాబోవుచున్నమేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, 12 మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. 13 ఏలయనగా మేకలయొక్కయు ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడినవారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, 14 నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీమనస్సాక్షిని ఎంతో యెక్కవగా శుద్ధిచేయును. 15 ఈ హేతువుచేత మొదటి నిబంధనకాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు. 16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము రుజువుపరచుట అవశ్యము. 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైన చెల్లునా? 18 ఇందుచేత మొదటి నిబంధనకూడ రక్తములేకుండ ప్రతిష్ఠింపబడలేదు. 19-20. ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతియాజ్ఞను ప్రజలతో చెప్పినతరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొర్రెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని - దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరిమీదను ప్రోక్షించెను. 2 21 అదేవిధముగా గుడారము మీదను సేవపాత్రలన్నిటిమీదను ఆ రక్తమును ప్రోక్షించెను. 22 మరియు ధర్మశాస్త్రప్రకారము సమస్తవస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తముచిందిపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. 23 పరలోకమందున్నవాటిని పోలిన వస్తువులు ఇట్టిబలులవలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోకసంబంధమైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడవలసియుండెను. 24 అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. 25 అంతేకాదు, ప్రధానయాజకుడు ప్రతిసంవత్సరము తనదికాని రక్తము తీసికొని పరిశుద్ధస్థలములోకి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్నుతాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. 26 అట్లయినయెడల జగత్తు పునాదివేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణచేయుటకై యొక్కసారే ప్రత్యక్షపరచబడెను. 27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. 28 ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాప (సంభంధ)ములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును. Download Audio File
1 ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయనేరవు. 2 ఆలాగు చేయగలిగిన పక్షమందు సేవించువారొక్కసారే శుద్ధిపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞాప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. 3 అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి 4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడుబలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. 6 పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు. 7 అప్పుడు నేను -గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడినప్రకారము, దేవా, నీ చిత్తమునెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. 8 - బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరిహారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవికావనియు పైని చెప్పిన తరువాత 9 ఆయన - నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవదాని స్థిరపరచుటకు మొదటిదాని కొట్టివేయుచున్నాడు. 10 యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. 11 మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. 12-13. ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు పర్యంతము కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. 14 ఒక అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడువారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. 15 ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్షమిచ్చుచున్నాడు. 16 ఏలాగనగా-ఆ దినములైన తరువాత నేను వారికి నియమింపబోవునిబంధన ఏదనగా, నా ధర్మవిధులను వారిహృదయమునందుంచి వారి మనస్సు మీద వాటినివ్రాయుదునుఅని చెప్పిన తరువాత 17 -వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొననుఅని ప్రభువు చెప్పుచున్నాడు. 18 వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థబలి యికను ఎన్నడును ఉండదు. 19-20. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియ, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, 21 దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, 22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములోఆత్మ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. 23 వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మననిరీక్షణ విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెననిఆలోచింతుము. 26 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలియికను ఉండదు గాని 27 న్యాయపుతీర్పుకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. 28 ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. 29 ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? 30 పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియుమరియు - ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదును గదా. 31 జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము. 32 అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతోకూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. 33 ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభవించినవారితో పాలివారలైతిరి. 34 ఏలాగనగామీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదిని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. 35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. 36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి కలిగియుండుట అవసరమై యున్నది. 37 - ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును. 38 నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసినయెడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు. 39 అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకువిశ్వాసము కలిగినవారమై యున్నాము. Download Audio File
1-2. ఇంతగొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయుదాని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కూడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు. 3 మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తమ స్వంత హానికేచేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. 5-6. మరియు - నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను నిర్లక్ష్యపెట్టకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 8 కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులుగారు. 9 మరియు శరీరసంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైనవానికి మరిఎక్కువగా లోబడి బ్రదుకవలెను గదా? 10 వారు కొన్ని దినములమట్టుకు తమ కిష్టమువచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. 11 మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. 12 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను చాపుడి. 13 మరియు కుంటికాలు బెణకక బాగుపడునిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి. 14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు. 15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైనవేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, 16 ఒకపూట కూటికొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. 17 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జంపబడెనని మీరెరుగుదురు. 5 18 స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు (కొండకును), అగ్నికిని, కారు మేఘమునకును, గఢాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. 19-20. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. 21 మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే - నేను మిక్కిలి భయపడుచున్నాననెను. 22 ఇప్పుడైతే సీమోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేముకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, 23 పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవునియొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకును, 24 క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును, హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. 25 మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీద నుండి బుద్ధిచెప్పినవానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్నవానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము గదా. 26 అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు - నేనింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు. 27 - ఇంకొకసారి అనుమాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండునిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తుగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. 28-29. మనము నిశ్చలమైన రాజ్యమును పొందియున్నాము గనుక (దైవ) కృప కలిగియుందుము. ఆ కృపకలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము; మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు. Download Audio File
1 సహోదరప్రేమ నిలువరముగా ఉండవలెను. ఆతిథ్యము చేయ మరవకుడి; కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. 2-3. మీరు వారితో కూడ బంధింపబడినట్టు బంధింపబడినవారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక బాధపడువారిని జ్ఞాపకము చేసికొనుడి. 4 వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. 5 ధనాపేక్షలేని మనస్సుగలవారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. - నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. 6 కాబట్టి - ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. 7 మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉండినవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసము అనుసరించుడి. 8 యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; ఆవును యుగయుగములకు ఒక్కటేరీతిగా ఉండును. 9 నానావిధములైన అన్యబోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్ధములనుబట్టి కాక కృపనుబట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు. 10 మనకొక బలిపీఠమున్నది; దానిసంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారము లేదు. 11 వేటిరక్తము పాపపరిహారార్ధముగ పరిశుద్ధస్థలములోకి ప్రధానయాజకునిచేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలపట దహింపబడును. 12 కావున యేసు కూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుకై గవిని వెలపట శ్రమపొందెను. 13 కాబట్టి మనమాయాననిందను భరించుచు శిబిరము వెలపలికి ఆయనయొద్దకు వెళ్లుదుము. 14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదుగాని యుండబోవుచున్నదాని కోసరము ఎదురుచూచుచున్నాము. 15 కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. 16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి. 17 మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దు :ఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ ప్రయోజనము గనుక దు :ఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. 18 మా నిమిత్తము ప్రార్ధనచేయుడి; మేమన్నివిషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము. 19 మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 20-21. గొర్రెల గొప్ప కాపరియైన యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసుక్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 22 సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. 23 మన సహోదరుడైన తిమొథెయుకు విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను. 24 మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇతలియవారు మీకు వందనములు చెప్పుచున్నారు. 25 కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్. Download Audio File