Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 23, 2013

హెబ్రీయులకు8వఅధ్యాయము

1  మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, 
2  అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైయుండి, పరలోకమందు మహామహునిసింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. 
3  ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము. 
4  ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్న పక్షమున యాజకుడైయండడు. 
5  మోషే గుడారము అమర్చబోయినప్పుడు-కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పునసమస్తమును చేయుటకు జాగ్రత్తపడుముఅని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు సేవచేయుదురు. 
6  ఈయనయైతే ఇప్పుడు మరి యెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు. 
7  ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపములేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు. 
8  అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడుప్రభువు ఇట్లనెను -ఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోనుయూదా ఇంటివారితోనునేను క్రొత్తనింబంధన చేయుదును. 
9  అది నేను ఐగుప్తుదేశములోనుండివీరి పితరులను వెలపలికి తీసికొని వచ్చుటకువారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదుగనుక నేను వారిని అలక్ష్యము చేసితిననిప్రభువు చెప్పుచున్నాడు. 
10  ఆ దినములైన తరువాతఇశ్రాయేలు ఇంటివారితోనేను చేయబోవు నిబంధన యేదనగానా ధర్మవిధులను వారి మనస్సులో ఉంచివారి హృదయములమీద వాటిని వ్రాయుదునునేను వారికి దేవుడనై యుందునువారు నాకు ప్రజలై యుందురు. 
11  వారిలో ఎవడును-ప్రభువును తెలిసికొనుడనితన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను బోధింపడువారిలో చిన్నలు మొదలుకొని పెద్దల పర్యంతముఅందరును నన్ను తెలిసికొందురు. 
12  నేను వారి అక్రమముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకముచేసికొనననిప్రభువు సెలవిచ్చుచున్నాడు. 
13  ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది నివర్తనమగుటకుసిద్ధముగా ఉన్నది. 
   Download Audio File

No comments:

Post a Comment