Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 23, 2013

హెబ్రీయులకు13వఅధ్యాయము

 1  సహోదరప్రేమ నిలువరముగా ఉండవలెను. ఆతిథ్యము చేయ మరవకుడి; కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. 
 2-3. మీరు వారితో కూడ బంధింపబడినట్టు బంధింపబడినవారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక బాధపడువారిని జ్ఞాపకము చేసికొనుడి. 
4  వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. 
5  ధనాపేక్షలేని మనస్సుగలవారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. - నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. 
6  కాబట్టి - ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. 
7  మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉండినవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసము అనుసరించుడి. 
8  యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; ఆవును యుగయుగములకు ఒక్కటేరీతిగా ఉండును. 
9  నానావిధములైన అన్యబోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్ధములనుబట్టి కాక కృపనుబట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు. 
10  మనకొక బలిపీఠమున్నది; దానిసంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారము లేదు. 
11  వేటిరక్తము పాపపరిహారార్ధముగ పరిశుద్ధస్థలములోకి ప్రధానయాజకునిచేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలపట దహింపబడును. 
12  కావున యేసు కూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుకై గవిని వెలపట శ్రమపొందెను. 
13  కాబట్టి మనమాయాననిందను భరించుచు శిబిరము వెలపలికి ఆయనయొద్దకు వెళ్లుదుము. 
14  నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదుగాని యుండబోవుచున్నదాని కోసరము ఎదురుచూచుచున్నాము. 
15  కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. 
16  ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి. 
17  మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దు :ఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ ప్రయోజనము గనుక దు :ఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడియుండుడి. 
18  మా నిమిత్తము ప్రార్ధనచేయుడి; మేమన్నివిషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము. 
19  మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
20-21. గొర్రెల గొప్ప కాపరియైన యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, యేసుక్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 
22  సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. 
23  మన సహోదరుడైన తిమొథెయుకు విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను. 
24  మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇతలియవారు మీకు వందనములు చెప్పుచున్నారు. 
25  కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్.
    Download Audio File

No comments:

Post a Comment