Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 23, 2013

హెబ్రీయులకు10వఅధ్యాయము

1  ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయనేరవు. 
2  ఆలాగు చేయగలిగిన పక్షమందు సేవించువారొక్కసారే శుద్ధిపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞాప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. 
3  అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి 
4  ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 
5  కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడుబలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. 
6  పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు. 
7  అప్పుడు నేను -గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడినప్రకారము, దేవా, నీ చిత్తమునెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. 
8  - బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరిహారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవికావనియు పైని చెప్పిన తరువాత 
9  ఆయన - నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవదాని స్థిరపరచుటకు మొదటిదాని కొట్టివేయుచున్నాడు. 
10  యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. 
11  మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. 
12-13. ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు పర్యంతము కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. 
14  ఒక అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడువారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. 
15  ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్షమిచ్చుచున్నాడు. 
16  ఏలాగనగా-ఆ దినములైన తరువాత నేను వారికి నియమింపబోవునిబంధన ఏదనగా, నా ధర్మవిధులను వారిహృదయమునందుంచి వారి మనస్సు మీద వాటినివ్రాయుదునుఅని చెప్పిన తరువాత
17  -వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొననుఅని ప్రభువు చెప్పుచున్నాడు. 
18  వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థబలి యికను ఎన్నడును ఉండదు. 
19-20. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియ, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, 
21  దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, 
22  మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములోఆత్మ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. 
23  వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మననిరీక్షణ విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. 
24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెననిఆలోచింతుము. 
26  మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలియికను ఉండదు గాని 
27  న్యాయపుతీర్పుకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. 
28  ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. 
29  ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? 
30  పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియుమరియు - ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పినవానిని ఎరుగుదును గదా. 
31  జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము. 
32  అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతోకూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. 
33  ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభవించినవారితో పాలివారలైతిరి. 
34  ఏలాగనగామీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదిని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. 
35  కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. 
36  మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి కలిగియుండుట అవసరమై యున్నది. 
37  - ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును. 
38  నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసినయెడల అతనియందు నా ఆత్మకు సంతోషముండదు. 
39  అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకువిశ్వాసము కలిగినవారమై యున్నాము.
    Download Audio File

No comments:

Post a Comment