1 ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును.
2 తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమి తెలియనివారియెడలను త్రోవ తప్పినవారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు.
3 ఆ హేతువుచేత ప్రజలకొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు.
4 మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనత పొందును.
5 అటువలె క్రీస్తుకూడ ప్రధానయాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని-నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటినిఅని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను.
6 ఆ ప్రకారమే-నీవు నిరంతరము మెల్కీసెదెకుయొక్క క్రమములో చేరిన యాజకుడవై యున్నావుఅని మరియొకచోట చెప్పుచున్నాడు.
7 శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీరకరింపబడెను.
8 ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.
9-10. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసెదెకుయొక్క క్రమములో చేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారకుడైయెను.
11 ఇందునుగూర్చిమేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట దుష్కరము.
12 కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.
13 మరియు పాలుత్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు.
14 వయస్సువచ్చినవారుఅభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.
Download Audio File

No comments:
Post a Comment