Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, July 24, 2013

హెబ్రీయులకు1అధ్యాయము

1  పూర్వకాలమందు నానాసమయములలోనునానావిధములుగాను ప్రవక్తలద్వారా మనపితరులతో మాటలాడిన దేవుడు 
2  ఈ దినముల అంతమందు కుమారునిద్వారా మనతో మాటలాడెను. ఆయన (ఆ కుమారుని) సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయనద్వారా ప్రపంచములనునిర్మించెను. 
3-4. ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, 3ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి, తన మహత్తుగలమాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు (దేవుని) కుడిపార్శ్వమున కూర్చుండెను. 
5  ఏలయనగా-నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కంటిని అనియు; ఇదియుగాక-నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడుఅనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా? 
6  మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెననిచెప్పుచున్నాడు. 
  7-8. -తన దూతలను వాయువులుగానుతన సేవకులనుఅగ్నిజ్వాలలుగాను చేసికొనువాడుఅని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే-దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజ్యదండమున్యాయార్థమై యున్నది 
9  నీవు నీతిని ప్రేమించితివిదుర్ణీతిని ద్వేషించితివిఅందుచేత దేవుడు నీ దేవుడు నీతోటివారికంటెనిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించెను. 8
10  మరియు-ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదివేసితివిఆకాశమండలము నీ చేతిపనియైనది 
11  అవి నశించును గాని నీవు శాశ్వతముగా ఉందువుఅవన్నియువస్త్రమువలె పాతగిలిపోవును 
12  ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువుఅవి వస్త్రమువలె మార్చబడును గానినీవు ఏకరీతిగానే యున్నావునీ సంవత్సరములు తరుగవుఅని చెప్పుచున్నాడు. 
13  అయితే-నేను నీ శత్రువులను నీ పాదములకుపాదపీఠముగా చేయు పర్యంతమునా కుడిపార్శ్వమున కూర్చుండుము10అని దూతలలో ఎవనిగూర్చియైన యెప్పుడైన చెప్పెనా? 
14  వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరచారముచేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
     Download Audio File

హెబ్రీయులకు2వఅధ్యాయము

1  కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేషజాగ్రత్త కలిగియుండవలెను. 
2  ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా 
3-4. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను మహత్కార్యములచేతను నానావిధములైన అద్భుతములచేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను. 
5  మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. 
6  అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడునీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవునరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? 
7  నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివిమహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివినీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి 
8  వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని 
9  దేవుని కృపవలన ఆయన ప్రతిమననుష్యునికొరకు మరణము అనుభవించునట్లు, 1దూతల కంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించినవానిగా ఆయనను చూచుచున్నాము. 
10  ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. 
11-12. పరిశుద్ధపరచువానికిని పరశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కడేమూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక - నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజమధ్యనీ కీర్తిని గానము చేతునుఅనెను. 
13  మరియు - నే నాయను నమ్ముకొనియుందును అనియు - ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. 5
14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదినిమరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. 
16  ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రహాముసంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు. 
17  కావున ప్రజల పాపములకు నివృత్తి కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులవంటివాడు కావలసివచ్చెను. 
18  తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడైయున్నాడు.

హెబ్రీయులకు3వఅధ్యాయము

 1  ఇందువలన, పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన పరశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనినదానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.
2  దేవుని యిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు, ఈయనకూడ తన్ను నియమించినవానికి నమ్మకముగా ఉండెను.
3  ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును;సమస్తమును కట్టినవాడుదేవుడే.
4  ఇంటికంటె దాని కట్టినవాడెక్కువ ఘనతపొందినట్లు, ఈయన మోషే కంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను.
5  ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని యిల్లంతటిలో నమ్మకముగా ఉండెను.
6  అయితే క్రీస్తు, కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
7  మరియు పరశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు
8  - నేడు మీరాయన శబ్దమును వినినయెడల అరణ్యములో శోధన పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
9  నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
10  కావున నేను ఆ తరమువారిమీద కోపగించి - వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నామార్గములను తెలిసికొనలేదు
11  గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలోప్రవేశింపరని చెప్పితిని
12  సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.
13-15. నేడు మీరాయన శబ్దమును వినినయెడల కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు - నేడు అని చెప్పబడిన సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి. ఏలయనగా మొదటినుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడల క్రీస్తులో పాలివారమై యుందుము.
 16  విని కోపము పుట్టించినవారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినవారందరే గదా?
17  ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారిమీదనే గదా? వారి శవములుఅరణ్యములో రాలిపోయెను.
18  తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరినిగూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా?
19  కాగా అవిశ్వాసముచేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము.
   Download Audio File

హెబ్రీయులకు4వఅధ్యాయము

1  ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైన ఒక వేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందుము.
2  వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినినవారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక వినబడిన వాక్యము వారికి నిష్ ప్రయోజనమైనదాయెను.
3  కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియైయున్నను ఈ విశ్రాంతినిగూర్చి-నేను కోపముతో ప్రమాణముచేసినట్టువారు నా విశ్రాంతిలో ప్రవేశింపరుఅని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.
4  మరియు-దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినిముగించి విశ్రమించెనుఅని యేడవ దినమునుగూర్చి ఆయన యొకచోట చెప్పియున్నాడు.
5  ఇదియుగాక ఈ చోటుననే - వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.
6-7. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో- నేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
8  యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియెక దినమునుగూర్చి ఆయన చెప్పక పోవును.
9  కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.
10  ఎదుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.
11  కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తపడుదుము.
12  ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
13  మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది.
14  ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు కలిగియున్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిన గట్టిగా చేపట్టుదము.
15  మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
16  గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృపపొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
    Download Audio File

హెబ్రీయులకు5వఅధ్యాయము

1  ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును. 
2  తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమి తెలియనివారియెడలను త్రోవ తప్పినవారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. 
3  ఆ హేతువుచేత ప్రజలకొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు. 
4  మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనత పొందును. 
5  అటువలె క్రీస్తుకూడ ప్రధానయాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని-నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటినిఅని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను. 
6  ఆ ప్రకారమే-నీవు నిరంతరము మెల్కీసెదెకుయొక్క క్రమములో చేరిన యాజకుడవై యున్నావుఅని మరియొకచోట చెప్పుచున్నాడు. 
7  శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీరకరింపబడెను. 
8  ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. 
9-10. మరియు ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసెదెకుయొక్క క్రమములో చేరిన ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్యరక్షణకు కారకుడైయెను. 
11  ఇందునుగూర్చిమేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట దుష్కరము. 
12  కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు. 
13  మరియు పాలుత్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. 
14  వయస్సువచ్చినవారుఅభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. 
Download Audio File

హెబ్రీయులకు6వఅధ్యాయము

1  కాబట్టి నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములనుగూర్చిన బోధయు, 
2  హస్తనిక్షేపణమును మృతుల పునరుత్థానమును, నిత్యమైనతీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము. 
3  దేవుడు సెలవిచ్చినయెడల మనమాలాగు చేయుదము. 
4  ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రూచిచూచి, పరశుద్ధాత్మలో పాలివారై 
5  దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల (ప్రభావమును) అనుభవించినతరువాత 
6  తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా అవమానపరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము. 
7  ఎట్లనగా, భూమి తనమీద తరచుగా కురియు వర్షమును త్రాగి యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. 
8  అయితే ముండ్లతుప్పలును గచ్చతీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకు కాల్చివేయబడును. 
9  అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము. 
10  మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. 
11-12. మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొనువారిని పోలినడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. 
13  దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక 
14  తనతోడు అని ప్రమాణముచేసి - నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునునిశ్చయముగా నిన్ను అభివృద్ధి పొందింతునుఅని4 చెప్పెను. 
15  (ఆ మాట నమ్మి) అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను. 
16  మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములలో వివాదాంశమును పరష్కారము చేయునది ప్రమాణమే. 
17-18. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్టలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణముచేసి వాగ్దానమును దృఢపరచెను. 
19  ఈ నిరీక్షణ మన ఆత్మకు నిశ్చలమును, స్థిరమును, తెరలోపల వ్రవేశించునదియునైయున్న లంగరువలె ఉన్నది. 
20  నిరంతరము మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధానయాజకుడై యేసు మనకంటె ముందుగా మన పక్షము ఆ తెరలో ప్రవేశించెను. 
   Download Audio File

హెబ్రీయులకు7వఅధ్యాయము

1-3. రాజులను సంహారముచేసితిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో దశమాంశము ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేమురాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళిలేనివాడును, జీవితకాలమునకుఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. 
4  ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో దశమాంశము ఇచ్చెను. 
5  మరియు లేవి కుమాళ్లలోనుండి యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రముచొప్పున వారియొద్ద, అనగా ప్రజలయొద్ద దశమాంశమును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని 
6  వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద దశమాంశమును పుచ్చుకొని వాగ్దానమును పొందినవానిని ఆశర్వదించెను. 
7  తక్కువవాడు ఎక్కువవానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమైయున్నది. 
8  మరియు (లేవి క్రమము చూడగా ) చావుకు లోనైనవారు దశమాంశములను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. 
9  అంతేకాక ఒక విధమున చెప్పినయెడల దశమాంశములను పుచ్చుకొను లేవియు అబ్రాహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. 
10  ఏలాగనగా మెల్కీసెదెకు అతని (పితరుని) కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. 
11  ఆ లేవీయులు యాజకులైయుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణసిద్ధి కలిగినపక్షమందు అహరోను క్రమములో చేరినవాడవని చెప్పబడక మెల్కీసెదెకు క్రమములోచేరి వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? 
12  ఇదియుగాక యాజకులు మార్చబడిన పక్షమున అవశ్యముగా (యాజక) ధర్మము సహా మార్చబడును. 
13  ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను; ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయలేదు. 
14  మన ప్రభువు గోత్రవిషయములో యాజకులనుగూర్చి మోషే యేమియు చెప్పలేదు. 
  15-16. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. 
17  ఏలయనగా - నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమములో చేరిన యాజకుడవై యున్నావు. అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను. 2
18-19. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ ప్రయోజనమైనందునను అది నివారణచేయబడి యున్నది; అంతకంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా దేవునియొద్దకు మనము చేరుచున్నాము. 
  20-22. మరియు ప్రమాణములేకుండ యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపయెను. వారైతే ప్రమాణము లేకుండ యాజకులవుదురు గాని యీయన - నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను; ఆయన పశ్చాత్తాపపడడు అని యీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. 
23  మరియు ఆ యాజకులు మరణము పొందుటచేత ఎల్లప్పుడు ఉండ సాధ్యముకానందున అనేకులైరి గాని 
24  ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను. 
25  ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారిపక్షము విజ్ఞాపనముచేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. 
26  పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నావాడును, ఆకాశమండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. 3
27-28. ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణసిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తనస్వంత పాపములకొరకును తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరముగలవాడు కాడు; తన్నుతాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను. 
   Download Audio File