Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 23, 2013

హెబ్రీయులకు12వఅధ్యాయము

 1-2. ఇంతగొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయుదాని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కూడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు. 
3  మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తమ స్వంత హానికేచేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 
4  మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. 
5-6. మరియు - నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను నిర్లక్ష్యపెట్టకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
7  శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 
8  కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులుగారు. 
9  మరియు శరీరసంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైనవానికి మరిఎక్కువగా లోబడి బ్రదుకవలెను గదా? 
10  వారు కొన్ని దినములమట్టుకు తమ కిష్టమువచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. 
11  మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. 
12  కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను చాపుడి. 
13  మరియు కుంటికాలు బెణకక బాగుపడునిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి. 
14  అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు. 
15  మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైనవేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, 
16  ఒకపూట కూటికొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. 
17  ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జంపబడెనని మీరెరుగుదురు. 5
18  స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియు (కొండకును), అగ్నికిని, కారు మేఘమునకును, గఢాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. 
 19-20. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. 
21  మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే - నేను మిక్కిలి భయపడుచున్నాననెను. 
22  ఇప్పుడైతే సీమోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేముకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, 
23  పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవునియొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకును, 
24  క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును, హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. 
25  మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీద నుండి బుద్ధిచెప్పినవానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్నవానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము గదా. 
26  అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని యిప్పుడు - నేనింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును అని మాట యిచ్చియున్నాడు. 
27  - ఇంకొకసారి అనుమాట చలింపచేయబడనివి నిలుకడగా ఉండునిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తుగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. 
28-29. మనము నిశ్చలమైన రాజ్యమును పొందియున్నాము గనుక (దైవ) కృప కలిగియుందుము. ఆ కృపకలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము; మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు. 
   Download Audio File

No comments:

Post a Comment